ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ..!

ఏపీలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

 

మొత్తంగా 96 మందిని డీఎస్పీలను బదిలీ చేయగా.. వీరిలో పలువురు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిగతా 57 మందిని మాత్రం హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలంటూ వారికి సూచించింది. బదిలీ అయిన డీఎస్పీ ఎధికారుల్లో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తోపాటు ఇతర పలు విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.

 

ఇదిలా ఉంటే.. మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై ఆయన సమీక్షించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014 – 2019 మధ్య 24 శాతం వృద్ధి సాధించగా, 2019-24 మధ్య ఏడు శాతం మాత్రమే ఉందంటూ అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టంపై ఈ సమీక్షలో చర్చించారు. అయితే, ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు రూ. 1,025 కోట్ల వరకు చెల్లించలేదంటూ అధికారుల తేల్చినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *