తేది:13-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: ఏడవ గ్యారంటిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనీ ఏడవ గ్యారంటీని ఏటిలో ముంచిన రేవంత్ సర్కారు. ఈ రోజు హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం జాబ్ క్యాలెండరును సక్రమంగా అమలు చేస్తూ వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి ఈ రోజు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చెయ్యడానికి రేవంత్ సర్కార్ పోలీసులను అడ్డుపెట్టుకొని తెల్లవారుజామున విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా తమ భావ ప్రకటన, స్వేచ్ఛను తెలిపే హక్కు విద్యార్థులు నిరుద్యోగులకు ఉందని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏడవ గ్యారంటీగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడవ గ్యారంటీని ఎట్లా ముంచేసారని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తామని విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ సర్కార్ను చీల్చి చెండాడుతామని, గత ప్రభుత్వంలో రాసిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాల కోసం కొట్లాడే నిరుద్యోగుల పట్ల నియంతల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, వెంటనే జాబ్ కేలండర్ ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రేపు విద్యార్థి నిరుద్యోగుల ఆధ్వర్యంలో జరగబోయే టీజీపిఎస్సి ముట్టడికి విద్యార్థి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు కామగోని శ్రావణ్ డిఎస్ఏ రాష్ట్ర కన్వినర్, మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మర్రి మహేష్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి, ఎల్తూరి సాయి కుమార్ ఎస్ఎస్యు జిల్లా అధ్యక్షులు, రాచకొండ రంజిత్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి, అశోక్ సేవాలాల్ సేన, తదితరులు పాల్గొన్నారు.