ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 18.5మిలియన్ డాలర్ల కలెక్షన్లతో షారుఖ్ పఠాన్($17.45 మిలియన్) మూవీని అధిగమించింది. ఇక అత్యధిక వసూళ్లలో బాహుబలి-2($20.7 మిలియన్) తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు కల్కి మూవీ రూ.1100 కోట్లు వసూళ్లు చేసింది.