అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు..

కొడంగల్ లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడమే కాకుండా నైపుణ్యాలను కూడా పెంపొందించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. దీనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నారు. బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.

 

అయితే, ఈ యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్నది. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నైపుణ్య యూనివర్సిటీని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *