ఆ విషయంలో కేసీఆర్ సైలెంట్..? ఎందుకు..?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చూసినవారికి ఏ మనిపించింది? విపక్షం బీఆర్ఎస్ బలంగా ఉందా? ఉనికి కోసం తన ప్రయత్నాలు చేస్తోందా? అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఎందుకు సైలెంట్‌ గా ఉన్నారు? ఆయన వాయిస్ డౌన్‌ఫాల్ అయ్యిందా? కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నేతలకు కలిగిన సందేహం ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

 

గురువారం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ్‌పెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ సెషన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ఎలా ఉన్నా, బాగాలేదని నార్మల్‌గా విపక్షం చెబుతుంది, చెప్పాలి కూడా. రేవంత్ బడ్జెట్ గురించి చెప్పాల్సిన నాలుగు ముక్కలు మీడియా ముందు చెప్పేశారు. కేసీఆర్ కూడా అదే చెప్పారు. కాకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకాలకు కనీసం నిధులు కేటాయించలేదన్నది ఆయన మాట.

 

రేవంత్ సర్కార్ ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం 8 నెలలు మాత్రమేనన్నది అధికార పార్టీ మాట. ఆర్థిక సంవత్సరం మొదలై నాలుగు గడిచిపోయింది. దీనికితోడు రైతుల రుణాలను కేవలం నెల వ్యవధిలో మొత్తం మాఫీ చేసిన ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు. ఏడాదికి కొంత చొప్పున బడ్జెట్‌లో కేటాయిస్తారు.

 

కానీ రేవంత్ సర్కార్ కేవలం నెలలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేసిన ఘనత సొంతం చేసుకుంది. ఒక్కసారి వెనక్కివెళ్తే.. కేసీఆర్ సర్కార్ గతంలో రుణమాఫీ ఈ స్థాయిలో చేసిన సందర్భం లేదు. ఏడాదికి కొంత చొప్పున విడుదల చేశారని, విడుదలైన మొత్తం వడ్డీలకే సరిపోయిందన్నారు.

 

ఇక అసలు విషయానికొద్దాం. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందంటూ తెలంగాణ అసెంబ్లీలో అధికార-విపక్షాలు మూకుమ్మడిగా తీర్మానం ప్రవేశపెట్టాయి. దీనిపై చర్చ సందర్భంగా అధికార -విపక్షాల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఢిల్లీలో దీక్షలు చేద్దామంటే చేద్దామనే స్థాయికి వెళ్లింది కూడా.

 

గురువారం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, కనీసం కేంద్ర బడ్జెట్‌పై నోరు ఎందుకు మెదపలేదన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. మీడియా మిత్రులు ప్రశ్నలు వేస్తే నోరు ఎత్తుకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ లెక్కన బీజేపీ-బీఆర్ఎస్ మధ్య డీల్ బయటపడిందన్నది అధికార పార్టీ నేతల మాట. అందుకోసమే కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు.

 

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ మాటల వేడి తగ్గిందని అంటున్నారు. మొత్తానికి అసెంబ్లీకి వచ్చి కూడా కేంద్రబడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత సైలెంట్ కావడం ఆ పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *