కవిత అరెస్ట్‌పై మొదటిసారిగా స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతోనే తన కూతురు, ఎమ్మెల్సీ కవితను జైలులో పెట్టారన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని ఆయన అన్నారు.

 

తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఏయే అంశాలను సభలో లేవనెత్తాలో అనేదానిపై కేసీఆర్ వారికి సూచించారు. ఈ క్రమంలో కేసీఆర్ కుమార్తె కవిత గురించి కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేవలం రాజకీయ కక్షతోనే నా బిడ్డా కవితను జైల్లో పెట్టారు. కన్న బిడ్డ జైలులో ఉంటే తండ్రిగా నాకు బాధ ఉండదా..?. అయినా నేను అగ్నిపర్వతంలా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులేమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే అనేవాడు బాగా ఎదుగుతాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోతుంది. అయినా కూడా పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో నిగ్నమవుతున్నారు. ఎమ్మెల్యేలు పదవులు అనుభవించాక పార్టీని మారుతున్నారు. ఎక్కడో ఉన్నవారిని తెరపైకి తెచ్చి, వారికి ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా ఇతర పదవులు ఇచ్చాను. కానీ వారు ఇప్పుడు పార్టీ మారుతున్నారు. పార్టీని వదిలివెళ్లేవారి గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు’ అని ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే.. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *