జల్‌శక్తి మంత్రితో రేవంత్ భేటీ.. జల్‌జీవన్ మిషన్ నిధుల పై చర్చ..!

జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలంటూ కేంద్రమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరంతా మూసీలో చేరుతుందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందంటూ సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

 

అంతేకాకుండా.. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు కేటాయించాలంటూ కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా గోదావరి నది జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లతో నింపే పనులకు రూ. 6 వేల కోట్లు కేటాయించాలంటూ సీఎం కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్‌లో నీటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రమంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

 

కాగా, 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా.. ఈ పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో 7.85 క్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్రమంత్రికి సీఎం చెప్పారు. నల్లా లేని ఇళ్లతోపాటు పీఎంఏవై(అర్భన్), రూరల్ కింద్ చేపట్టే ఇళ్లకు నల్లా కనెన్లు కేటాయించాలంటూ సీఆర్ పాటిల్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్ గాధీని, ప్రియాంక గాంధీలను కలిశామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామంటూ వారికి వివరించామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ చేసినట్లు అగ్రనేతలకు చెప్పామన్నారు. అదేవిధంగా తెలంగాణకు రావాలని వారిని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కూడా కలిసి తెలంగాణ పీసీసీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు భట్టి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *