వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు..?

వైసీపీ త్వరలో ఖాళీ అవుతుందా? 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు కూటమి వైపు చూస్తున్నారా? మండలి నుంచి 10 ఎమ్మెల్సీలు కూటమి వైపు వచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నారా? కూటమి నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయి? అదే జరిగితే వైసీపీ పరిస్థితి? అన్నదానిపై అసెంబ్లీ లాబీల్లో సోమవారం చిన్నపాటి చర్చ జరిగింది.

 

గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌ .. బీజేపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లారు. తన ఛాంబర్‌కి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా నేతల మధ్య చిన్నపాటి చర్చ జరిగింది.

 

పలువురు వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఏం చేద్దామని బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేష్‌కు చెప్పారట. దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు బీజేపీ వైపు వచ్చేందుకు సిద్ధమైనట్టు అందులోని సారాంశం.

 

అది నిజమేనా అంటూ మంత్రి సత్యకుమార్‌ను రామకృష్ణారెడ్డి అడిగారు. ఈ విషయంలో కూటమి నేతలు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే మంచిదని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయా న్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది. వలసలపై మూడు పార్టీలు సమన్వయంతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటే బాటుందని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అన్నట్లు సమాచారం.

 

ఈ ఆలోచన బాగుందని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారట. రేపో మాపో కూటమి తరపున ఓ కమిటీ రూపుదిద్దుకోనుంది. దీని తర్వాత వైసీపీ కీలక నేతలు జనసేన, బీజేపీ, టీడీపీ వైపు వెళ్లడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి కొద్దిరోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నది నేతల చర్చ.

 

ప్రస్తుతం తమకు వైసీపీలో ఎలాంటి గౌరవం లేదని, అదే అధికార పార్టీ వైపు వెళ్తే కనీసం గౌరవం దక్కుతుందని మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావిస్తున్నారట. ఈ క్రమంలో నేతలు ఫ్యాన్‌కు దూరమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు అంతర్గత సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *