దేశంలోనే నంబర్. 1 అవినీతి పరుడు ఆయనే: అమిత్ షా..

ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ దేశంలోని అవినీతికి అతిపెద్ద నాయకుడని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. అవినీతిని ఆయన సంస్థాగతం చేశారని విమర్శించారు. పుణెలో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్లొన్న అమిత్ షా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనా, రాహుల్ గాంధీకిి అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈ ఏడాది జరిగే మహారాష్ట్ర, హర్యాణా, ఝూర్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాహుల్ అహంకారం తగ్గుతుందని అన్నారు.

 

శివసేన యూపీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఔరంగ జేబు అభిమాన సంఘం నాయకుడిగా అభివర్ణించారు. 1993లో జరిగిన ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యూకుబ్ మీనన్‌ క్షమాభిక్ష ప్రసాధించాలని ఆందోళన చేశారని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని మహాయుతి 2014, 2019 శాసన సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా మెజారిటీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే శరద్ పవార్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ స్పందించింది. బీజేపీ వాషింగ్ మెషిన్ ప్రక్రియకు పాల్పడుతోంది. కొందరు నాయకులను వారి పార్టీలోకి చేర్చుకునే వారి అవినీతికి చట్టబద్ధత కల్పిస్తోంది. బీజేపీ పార్టీలో ఉన్న వారంతా అవినీతి పరులే అంటూ కౌంటర్ ఇచ్చింది.

 

ఇదిలా ఉంటే మరోవైపు వరుసగా చోటు చేసుకుంటున్న రైలు ప్రమాదాలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రభుత్వం రైలు ప్రమాదాలు నివారించే దిశగా చర్యలు చేపట్టకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి ఉంటుందన్నారు. రెండు శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ప్రశ్నించారు. రైల్వేలు నిర్వహించడం లోపంతో రైలు ప్రమాదాలు ఒకదానికొకటి జరుగుతున్నాయి. రైల్వేలకు సకాలంలో నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.

 

రైల్వే ప్రమాదాల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, దీని గురించి ప్రభుత్వం ఆలోచించకుండా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ..కాగా ఇటీవల యూపీలో గూండా వద్ద చండీగఢ్ దిబ్రుగఢ్ ఎక్స్‌ప్రెస్ రైల పట్టాలు తప్పిన ప్రమాదంలో ముగ్గురు మరణించగా 30 మంది గాయాలపాలయ్యారు. బీజేపీ తమ ఆలోచనల గురించి ఎవరితో పంచుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. బడ్జెట్ విషయంలో రాష్ట్రాల సూచనలు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *