‘టెర్రరిస్టుల కంటే ఒక్కడుగు ముందుండాలి’.. భద్రతా ఏజెన్సీలకు అమిత్ షా కీలక సూచన..

టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు దేశంలోని అన్ని భద్రతా, నిఘా ఏజెన్సీలు కలిసి పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అన్ని భద్రతా ఏజెన్సీల అధ్యక్షులతో అమిత్ షా.. హై లెవిల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇంటెలిజెన్స్ విభాగం పనితీరును భద్రతా ఏజెన్సీల అధ్యక్షులతో కలిసి కేంద్ర హోం మంత్రి సమీక్షించారు.

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భద్రతా ఏజెన్సీలు సమష్టిగా కొత్త విధానాలు తీసుకురాబోతున్నాయి. దేశంలో పౌరుల భద్రత విషయంలో ఏజెన్సీలు.. ఇంటెలిజెన్స్ విభాగం మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో క్రియాశీలంగా పనిచేసేందుకు కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి.

 

ఈ కీలక సమావేశంలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “ఉగ్రవాదుల నెట్ వర్క్, వారికి సహాయం అందించే సిస్టమ్‌ని ఎదర్కొనేందుకు అన్ని భద్రతా ఏజెన్సీలు కలిసి కట్టుగా పనిచేయాలి.. దేశంలో పెరుగుతున్న ఉగ్ర చర్యలను ఆపేందుకు ఇది అత్యవసరం,” అని చెప్పారు.

 

దీని కోసం భద్రతా ఏజెన్సీల ఒక జాయింట్ సెంటర్.. 24 గంటలూ పని చేసే ప్లాట్ ఫార్మ్ గా కావాలని… ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే స్పందించేందుకు కీలక సమాచారం అన్ని భద్రతా ఏజెన్సీలు.. అవసరమైనవాళ్లకు అందజేసేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

 

”భద్రతా సమస్యలను ఎదుర్కొనేందుకు ఉగ్రవాదల కంటే మనం ఒక్కడగు ముందే ఉండాలి.. అప్పుడే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలం,” అని అమితా అధికారులకు సూచించారు.

 

జాతీయ భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ శాఖ, భద్రతా ఏజెన్సీలు, పోలీస్ స్పెషల్ ఫోర్స్.. అందరూ కలిసి ప్రభుత్వ నిర్ణయాలను సమష్టిగా అమలుపరిచేందుకు ఒకే విధానంతో పనిచేయాలని అన్నారు.

 

దేశంలో ఇటీవల ఉగ్రవాద దాడులు, నక్సలైట్ల చర్యల దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది. కశ్మీర్ డోడా, కఠువా ప్రాంతాల్లో ఇటీవలు పలువురు సైనికులు.. ఉగ్రవాద దాడులలో చనిపోయారు. ఛత్తీస్ గడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సైట్లను భద్రతా దళాలు ఎదుర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *