గ్రూప్ -2 పరీక్ష వాయిదా..

తెలంగాణ గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేసింది. డీఎస్సీ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌కు వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ కారణంగా గ్రూప్- 2ను వాయిదా వేయాలని నిరుద్యోగుల ఆందోళన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

గ్రూప్ -2 పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. గ్రూప్ -2 పరీక్ష వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాలని గత నెల రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్ , దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు పలు రకాలుగా నిరసనలు తెలిపారు. నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అశోక్‌నగర్‌లో భారీ నిరసన చేపట్టిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ సచివాలయం ముట్టడికి కూడా పిలుపునిచ్చారు అభ్యర్థులు.

 

మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పరీక్ష వాయిదా పడటంతో పోస్టులు కూడా పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2 వేల పోస్టులు అదనంగా పెంచాలని అంటున్నారు. నిరుద్యోగుల డిమాండ్ నేపథ్యంలో పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *