ప్రభాస్‌ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్‌..?

‘కల్కి’ బ్లాక్ బస్టర్ జోష్‌లో ఉన్న ప్రభాస్ నటించే తర్వాతి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటించబోయే మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *