ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్ మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్‌నాథ్‌లో 228 కేజీల బంగారం గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆ సమస్యలను ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్‌లో స్కామ్ చేశారని, ఇప్పుడు ఢిల్లీలో అలాంటి ఆలయాన్ని నిర్మిస్తారా అని అవిముక్తేశ్వరానంద ఆరోపించారు.
కేదార్‌నాథ్‌లో భారీ కుంభకోణం జరిగినా ఇప్పటి వరకు కేసులో దర్యాప్తు జరగలేదని అన్నారు. అంతే కాకుండా బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని కడతామని అనడం ఎంత వరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ తనకు ప్రమాణాలు చేశారని, తమ దగ్గరకు వచ్చిన వారిని దీవించడం తమ విధానం అని తెలిపారు. ప్రధాని తమకు శత్రువు కాదని అన్నారు. కానీ ఒక వేళ ఆయన కూడా తప్పు చేస్తే మేం ఎత్తిచూపుతామని తెలిపారు.
స్వామి అభి ముక్తేశ్వర్ ఆనంద్ సరస్వతి మీడియా తో మాట్లాడారు. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండేపై ఒత్తిడి చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేసి తెలిపారు. భారత సనాతన ధర్మాన్ని అనుసరించిన ఆ పుణ్యాల నిర్వచనం మనకు తెలుసు. ద్రోహం అతి పెద్ద పాపమని తెలుసు. ఏక్నాథ్ ఎదుర్కున్న ద్రోహానికి మేమంతా బాధపడ్డాం ఐదు చెప్పుకొచ్చారు. మొత్తం ప్రజానీకం దీంతో ఆవేదన చెందింది. ఇటీవల ఎన్నికల్లో ఇది ప్రతిబింబించింది అన్నారు. రాజకీయాలతో సంబంధం లేదన్నా తాను మాట్లాడుతూ ఉండానని తెలిపారు.