పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుక్ మై షోలో 10 మిలియన్ టికెట్లకు పైగా విక్రయమైన చిత్రంగా నిలిచింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.