ప్రభాస్ ఫ్యాన్స్‌కి కల్కి నిర్మాత అశ్వినీదత్ గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో కల్కి పార్ట్ 2 థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో కల్కి పార్ట్ 2పై మరింత అంచనాలను పెంచేశాయి.