కల్కి సినిమా చూశాను.. చాలా ఎమోషనల్‌గా అనిపించిందని విజయ్ దేవరకొండ అన్నారు. ‘ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగీ, ప్రభాస్ అన్న గురించి చేసిన పాత్ర అది. అర్జునుడిగా మూవీ చివరిలో కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు సంతోషంగా ఉంది. తెరపై విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నట్లు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగీ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం.’ అని విజయ్ తెలిపారు.