కారు పార్టీకి ఊహించని షాకులు..కీలక నేతలు వలసతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బీఆర్ఎస్ పార్టీ.

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కారు పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లతో వాళ్లంతా మంతనాలు సాగించినట్టు సమాచారం. వీలు కుదిరితే రేపోమాపో ఆ ముగ్గురు కాంగ్రెస్‌లో జాయిన్ కావడం ఖాయంగా తెలుస్తోంది.

సీనియర్లు, కీలక నేతలు వలసతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. రోజుకో నేత కారు నుంచి దిగి పోతుండడంతో ఆ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కీలక నేతలతో ఆయన మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా స్పందించడంతో ఆయన రేపో మాపో సొంతగూటికి చేరడం ఖాయమని అంటున్నారు.

శనివారం సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సమావేశమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

నార్మల్‌గా బస్వరాజు సారయ్య కాంగ్రెస్ వాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కిరణ్‌‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. విభజన తర్వాత నేతలు వలస పోవడంతో 2016లో సారయ్య బీఆర్ఎస్‌లో చేరిపోయారు. కొన్నాళ్ల తర్వాత కారు పార్టీ.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకున్న పరిచయాలతో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *