బీటౌన్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ ఒక సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ‘హనుమాన్’ రణ్‌వీర్‌కు తెగ నచ్చేసిందని, దీంతో ఆ డైరెక్టర్‌తో మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని తరహాలోనే మైథలాజికల్ టచ్ ఉన్న పీరియాడికల్ డ్రామా తీయాలని భావిస్తున్నారట. దీని కోసం ఇప్పటికే ఇద్దరూ పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రూ.200కోట్లతో దీని రూపొందించనున్నట్లు టాక్.