వాయిదా పడిన ‘ట్యాక్సీ వాలా’ టీజర్

వాయిదా పడిన ‘ట్యాక్సీ వాలా’ టీజర్


విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్ర టీజర్‌ని ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే టీజర్ ను ముందు చెప్పినట్టు ఏప్రిల్ 17న కాకుండా ఏప్రిల్ 18న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రియాంక జవల్కర్ ,మాళవిక నాయర్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *