సచిన్‌ కు విరాట్‌ కోహ్లి కృతజ్ఞతలు

సచిన్‌ కు విరాట్‌ కోహ్లి కృతజ్ఞతలు

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు విరాట్‌ కోహ్లి కృతజ్ఞతలు తెలిపాడు. టైమ్స్‌ మేగజైన్‌ విడుదల చేసే ‘100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా’లో కోహ్లి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో​ చోటు దక్కించుకున్న వారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లోని ప్రముఖులు రాస్తుంటారు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రాశారు. పరుగుల సాధించాలన్న కసి, ఆటలో నిలకడ ప్రదర్శించడం విరాట్‌ గొప్పదనమని పేర్కొన్నాడు. భారత్‌కు ఎన్నో పేరు ప్రఖ్యాతుల్ని అందించాలి. గో విరాట్‌..! అంటూ ప్రొఫైల్‌కు ముగింపునిచ్చాడు సచిన్‌.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *