‘రేస్ 3’ కోసం కాశ్మీర్ వెళుతున్న సల్మాన్

‘రేస్ 3’ కోసం కాశ్మీర్ వెళుతున్న సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్ 3’ చిత్రాన్ని చేస్తున్నాడు. జూన్ 15న విడుదల కానున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క సాంగ్‌ని చిత్రీకరించేందుకు సల్మాన్ అండ్ టీమ్ త్వరలో కశ్మీర్‌కి వెళ్ళనుంది. లీ, లడఖ్ ప్రాంతాలలో మూడు రోజుల పాటు చిత్ర బృందం అంతా కశ్మీర్‌లోనే ఉంటుంది. భజరంగీ భాయిజాన్ తర్వాత సల్మాన్ కశ్మీర్‌లో చిత్రీకరణ చేస్తున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *