రూ.లక్ష కోట్లతో ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ డీల్ ..వచ్చేవారమే.!
గత కొంతకాలంగా ఫ్లిప్కార్ట్లో మెజారిటీ వాటాను వాల్మార్ట్ సొంతం చేసుకోనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం జరగొచ్చని సమాచారం. ఈ ఒప్పందం విలువ 18 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.19లక్షల కోట్లు. ఫ్లిప్కార్ట్లో 51శాతం, అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసేందుకు వాల్మార్ట్ చర్చలు జరుపుతోంది. డీల్ దాదాపు పూర్తయ్యిందని, మే మొదటి వారంలో దీనిపై స్పష్టత వస్తుందని కూడా అంటున్నారు.