100 బిలియన్ డాలర్ల మైలురాయికి చేరువలో టిసిఎస్
ఐటి దిగ్గజం టిసిఎస్ 100 బిలియన్ డాలర్ మైలురాయికి చేరువలో నిలిచింది. కంపెనీ షేర్లు శుక్రవారం 7 శాతం పెరిగి మార్కెట్ ముగిసే సమయానికి 3,414 రూపాయల గరిష్ఠ స్థాయిని తాకడంతో కంపెనీ మార్కెట్ విలువ 9,818 కోట్ల డాలర్లయింది (రూ.6.52 లక్షల కోట్లు). ఒక్క రోజులోనే కంపెనీ ఇన్వెస్టర్ల సంపద 40 వేల కోట్ల రూపాయలు పెరిగింది. గురువారం కంపెనీ ఫలితాలు ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు వాటాదారులకు ప్రతి ఒక్క షేరుకు మరో షేరు బోనస్ ప్రకటించింది.