పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన కేరళ సీఎం విజయన్
హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి విజయన్ గురువారం మధ్యాహ్నం హైద్రాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. దేశంలో రెండో ఆదర్శ పోలీస్ స్టేషన్‌గా పంజగుట్ట పోలీస్ స్టేషన్ రికార్డులకెక్కింది.దీంతో ఈ పోలీస్‌స్టేషన్‌ను విజయన్ సందర్శించారు.
సీపీఎం జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా విజయన్ గురువారం నాడు మహాసభల భోజన విరామ సమయంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, టెక్నాలజీని ఉపయోగించుకొంటున్న పోలీసులు తదితర విషయాలను పోలీసు అధికారులు ముఖ్యమంత్రి విజయన్‌కు వివరించారు.
పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీసు సిబ్బందిని విజయన్ అభినందించారు. సుమారు 2.5 లక్షల మందికి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ సేవలు అందిస్తోంది. టెక్నాలజీ సహాయంతో అతి త్వరగా కేసులను పరిష్కారం చేయడంలో పంజాగుట్ట పోలీసులు ముందుంటున్నారు.
నగరానికి వచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విజయన్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై విజయన్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో అత్యుత్తమ పీఎస్‌గా అవార్డు అందుకున్న విషయాన్ని డీజీపీ విజయన్ దృష్టికి తీసుకొచ్చారు.