కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామం లో ప్రయాణీకుల దహర్తిని తీర్చడం అభినందనీయం అని చిగురుమామిడి ఎస్సై మామిడాల సురేందర్ అన్నారు సోమవారం సుందరగిరి గ్రామంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ ఆధ్వర్యంలో కీర్తిశేషులైన శ్రీమూర్తి ఆంజనేయులు జ్ఞాపకర్దం చలి వెంద్రం ఏర్పాటు చేయగా చిగురుమామిడి ఎస్సై మామిడాల సురేందర్ హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి శ్రీమూర్తి రమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ సభ్యులు వంతడుపుల దిలిప్ కుమార్, కంది శంకర్, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ సెక్రటరీ న్యాయవాది బాకం సంపత్, న్యాయవాది బెజ్జంకి రాంబాబు, సుందరగిరి ఆటో యూనియన్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరలు పాల్గొన్నారు.