తెలంగాణలో రైతుబంధు (రైతు భరోసా) డబ్బుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 3 ఎకరాలు ఉన్న వారికే ఈ స్కీమ్ వర్తించిందన్నారు. ప్రస్తుతం నాలుగెకరాలు ఉన్న రైతులకూ రైతుబంధు అందిస్తున్నామని చెప్పారు. త్వరలో ఐదు ఎకరాలు ఉన్నవారికి కూడా నగదు జమ చేస్తామన్నారు. గత ప్రభుత్వం కొండలు, గుట్టలున్న బడాబాబులకూ రైతుబంధు ఇచ్చి రూ.20వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.