శివరాత్రి కానుకగా ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి క్రేజ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ స్పెషల్ ప్రోమోను మార్చి 8న శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే, అదే రోజు రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *