బెంగళూరు, : కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించు కోవాలని కమలనాధులు ‘ఆపరేషన్ కమలం’ను మరోసారి రంగం మీదికి తెచ్చేందుకు యత్ని స్తున్నారు . మాజీ సిఎం యడ్యూరప్ప గురువారం రాత్రి ఉత్తర కర్ణాటక కేంద్రస్థానం హుబ్బళ్లిలో పలువురు నాయకులతో సమావేశం జరిపి కుమారస్వామి పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేం దుకు వున్న అవకాశాలపై చర్చించినట్లు సమాచారం. కుందగోళ్, చింఛోళి విధాన సభల ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుస్తారని, ఆ తరువాత జరిగే పరిణామాల వలన కుమారస్వామి ప్రభుత్వం మైనారిటిలో పడుతుందని సదరు నాయకులకు తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బిజెపికు ఇపుడు 104 శాసనసభ్యులు వుండగా, రెండు ఉప ఎన్నికల్లో గెలిస్తే దాని బలం 106కు చేరుకుం టుంది. వీరికి తోడు మరోముగ్గురు ఇండిపెం డెంట్ సభ్యుల మద్దతు లభిస్తుందని, దీంతో మొత్తం 109 సభ్యుల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా మరో నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని వీరిని కూడా కలుపుకుంటే ఈసంఖ్య 113కు చేరుతుందని, దీంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతే తమకే మళ్లీ తమకు అవకాశం వస్తుం దని యడ్యూరప్ప పేర్కొన్నట్లు సమాచారం.