అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కనుక వెనక్కి తగ్గకుంటే ప్రధాని మోదీ కథ అప్పుడే ముగిసేదని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీతో రాజీనామా చేయించాలని వాజ్‌పేయి భావించారని సిన్హా పేర్కొన్నారు. మోదీ కనుక రాజీనామాకు తిరస్కరిస్తే ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మోదీ నిర్ణయించారని అన్నారు.
అయితే, మోదీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ రూపంలో పెద్ద అండ దొరికిందన్నారు. మోదీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ బెదిరించారని, దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారని సిన్హా వివరించారు. ఆ రోజు కనుక వాజ్‌పేయి వెనక్కి తగ్గకుంటే మోదీ కథ అప్పుడే ముగిసి ఉండేదని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.