టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు అవినీతిపై సీఎంకు అన్ని ఆధారాలు అందజేస్తామని అన్నారు. విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీ లేఖల ద్వారా అన్ని ఆధారాలు అందజేస్తున్నామని, హరీష్ రావును ప్రజాక్షేత్రంలో లోనే ఎండగట్టడం కాకుండా లీగల్ వెళుతున్నా అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
కరప్షన్ ఎవరు చేసిన నిగ్గు తెలాల్సిందేనని.. తెలంగాణపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. కరువు మండలాలుగా ప్రకటించాలని, ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో పంటలు వేయవద్దని చెప్పిన ఘనత రేవంత్ దేనని ప్రధాని మోడీని కలిసిన రేవంత్ కరువును ప్రస్థావించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్‌లు తప్ప పనికి వచ్చే పనులకోసం మాట్లాడలేదని కవిత క్లారిటీ ఇచ్చారు.
ఇంటర్ బోర్డు రద్దు పై రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని కవిత డిమాండ్ చేశారు. భైరవ యాత్ర సిద్ధం అవుతుందని దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం కోసం మా యాత్ర చేస్తున్నామని కవిత అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేశాడు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.