టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు ఎన్టీఆర్ (NTR)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెలియజేశారు. ఎవరు ఊహించని విధంగా ఎన్టీఆర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సినిమా చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.
తాజాగా ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫోటోని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. నవ్వుల విందు సిద్ధమవుతోంది అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడంతో తారక్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు . ఇలా ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ పై అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ.. మన కాంబినేషన్ ఎప్పటినుంచో బాకీ ఉంది తారక్ సర్.. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. త్వరలో రోలింగ్ కాదు..కాదు ROFL-ing అంటూ అనిల్ రావిపూడి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నారు.
అనిల్ రావిపూడి ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఎన్టీఆర్ తో చేసే ఈ సినిమా 2028 సంక్రాంతికి వస్తుందా లేదా 29 సంక్రాంతికి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేస్తారా లేదంటే దేవర 2 తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇలా ఎన్టీఆర్ లైనప్ భారీగా ఉన్న నేపథ్యంలో అనిల్ రావిపూడితో ఎవరు కూడా సినిమా ఊహించలేదు. ఇలా ఊహించని విధంగా వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ తిరిగి కామెడీ వైపు అడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది.