తమిళనాడు బాలికల లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్..!

తమిళనాడులో బాలికలపై లైంగిక దాడి కేసు సంచలనం సృష్టిస్తుంది. జెమ్ గ్రానైట్స్ సంస్థ యజమాని ఆర్. వీరమణి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై రాయపేటలోని లాయిడ్స్ రోడ్డులో ఉన్న వీరమణి ఇంటికి 10 మందికి పైగా సిట్ పోలీసులు చేరుకున్నారు. ఇంటి లోపల గదులతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేకంగా ఇంటి ఆవరణలో ఉన్న తోట ప్రాంతంపై పోలీసుల దృష్టి పెట్టారు. వీరమణి ఇంటి తోటలో బాలిక మృతదేహాన్ని పాతిపెట్టి ఉండవచ్చంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ సమాచారం ఆధారంగా తోటలో అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాలికకు సంబంధించిన ఆనవాళ్లు, ఇతర కీలక ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ చేస్తున్నారు. ఇప్పటికే బాలికలపై లైంగిక దాడి ఆరోపణల కేసులో వీరమణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం జైలులో ఉన్న వీరమణికి సంబంధించిన కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్.. తోటలో లభించే ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉన్నట్టు అక్కడి అధికారులు అనుకుంటున్నారు. బాలికను నిజంగానే అక్కడ పాతిపెట్టారా.. పోలీసుల తనిఖీల్లో ఏవైనా అవశేషాలు బయటపడతాయా అన్న ఉత్కంఠ అక్కడ రేపుతుంది. దీంతో సోదాల అనంతరం పోలీసుల అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకోంది.