టాలీవుడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది పూనమ్ కౌర్ (Poonam Kaur). ఒకరకంగా చెప్పాలి అంటే ఈమె సినిమాల ద్వారా కంటే కూడా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను డైరెక్ట్ గా టార్గెట్ చేసుకొని చేస్తున్న కామెంట్ల ద్వారానే మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. గత కొంత కాలం వరకు ఆయన పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన పూనమ్ కౌర్ ఇటీవల ఆయన పేరును నేరుగా ప్రస్తావిస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి మరో ఇంస్టాగ్రామ్ స్టేటస్ తో సంచలనం సృష్టించింది. “ఫేక్ గురు” అంటూ ఒక పోస్ట్ పంచుకుంది. విషయంలోకి వెళ్తే.. పూనమ్ కౌర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా.. “ఫేక్ గురు.. నేను మీ ప్రవర్తనను ప్రశ్నించినందుకే నా కెరియర్ను నాశనం చేశారా? అసలు దేవుడు మీకు ఏం చేశాడో చూడండి. కొంచెం సిగ్గు తెచ్చుకోండి. మీరు వేదికపై విలువలను వల్లించవచ్చు. నేను వాటిని కూడా ఆచరిస్తాను. కానీ మీ ఆటలు ఇకపై సాగవు. అన్నట్టుగా ఒక పోస్ట్ షేర్ చేసింది పూనమ్ కౌర్ . మొత్తానికైతే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం వల్లే పూనం కౌర్ ఈ రేంజ్ లో పోస్ట్ పెట్టిందనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలు ఇంకొకరిని ఉద్దేశించి కామెంట్లు చేస్తేనే.. బహిరంగ ప్రదేశాలలో వారి గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో డిబేట్ పెట్టుకుంటున్న రోజులలో ఏకంగా స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ ను ఆమె నేరుగా ప్రస్తావిస్తూ తన జీవితాన్ని నాశనం చేశాడు అంటూ పలుమార్లు పోస్ట్‌లు పెడుతున్నా .. త్రివిక్రమ్ ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్న ఇప్పుడు ఆడియన్స్ అందరిలో తలెత్తుతోంది. అసలు త్రివిక్రమ్ సైలెన్స్ వెనుక కారణం ఏంటి? అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై త్రివిక్రమ్ స్పందిస్తారా? లేక పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన రచయితగా, డైరెక్టర్‌గా మంచి పేరు సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్. అంతేకాదు మాటల మాంత్రికుడిగా కూడా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన తాజాగా వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. అప్పుడప్పుడు పలు షోలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కొత్త సీజన్లో తన స్నేహితుడు సునీల్‌తో కలిసి సందడి చేశారు.