శరణమా..? రణమా? అనే రేంజ్లో ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మాట విన్నారా సరేసరి. లేదంటే దండనతో దారిలోకి తెచ్చేకుంటామన్నారు. ప్లాన్ ఏ.. ప్లాన్ బీ.. ఆ రెండింటిలో ఏదో ఒకటి వచ్చే ఆదివారం ఫిక్స్ చేస్తామన్నారు ట్రంప్. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం అంటూనే మరోవైపు మాట వినకపోతే దాడులు తప్పవని చురకలేస్తునే ఉన్నారయాన.
ట్రంప్ తీరు చూస్తుంటే ఇరాన్‌ను స్మాష్ చేసేదాక నిద్రపోయేట్టు లేడనే చర్చ జరుగుతున్న టైమ్‌లో అమెరికా యాక్షన్ ప్లాన్ ఏంటో మరో హింట్ ఇచ్చారాయన. న్యూక్లియర్ వెపన్స్ అంశంలో ఇరాన్ శాంతి చర్చలకు లోబడి దారిలోకి వస్తే మంచిది. అలా కాకుంటే ఇరాన్‌పై దాడులు తప్పవు. సమయంలేదు..మరణ మా శరణమా.. ఏదో ఒకటి ఆదివారం ఫైనల్ చేసేస్తామన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా లక్ష్యమన్నారు ట్రంప్. అది సాధించే వరకు ఎన్ని దాడులకైనా వెనుకాడమన్నారు.
సైనిక చర్యలను కొనసాగించాలా?
ప్రస్తుతం అమెరికా ఎలక్షన్ మూడ్‌లో ఉంది. నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు ట్రంప్ తన దూకుడుకు కళ్లెం వేయక తప్పదనే చర్చ జరుగుతుంది. ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఇరాన్‌పై సైనిక చర్యలను కొనసాగించాలా? అన్న విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఇటీవలే అన్నారుట్రంప్ ఇప్పడు ఆదివారం ఏదో ఒకటి తేల్చుకుంటామనిమరో హింట్ ఇచ్చారు. ఈక్రమంలో ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాల మోహరింపు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
సమస్యకు పరిష్కారం దొరికేనా?
మరోవైపు అమెరికా దాడులు చేస్తే ఎలా బదులివ్వాలో తమకు బాగా తెలుసంటోంది ఇరాన్. మధ్యవర్తుల ద్వారా అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని కూడా చెప్తోంది. అయితే అమెరికా విధిస్తున్న షరతులు, ఇరాన్ అభ్యంతరాల నేపథ్యంలో ఒప్పందం కుదురుతుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. చర్చలతో సమస్యకు పరిష్కారం దొరికేనా? లేక మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా? అమెరికా, ఇరాన్ తదుపరి అడుగులపైనే ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది.