ఇలాంటి అభిమానం నాకొద్దు, వారి మరణంపై కన్నీరు మున్నీరైన హీరో యష్..!

అక్కడే ముగ్గురు యువకులు మరణించారు. హనుమంత హరిజన్, మురళీ నాదవినమణి, నవీన్ గాజి విద్యత్ షాక్ కారణంగా మృతి చెందారు. మరో ముగ్గురు అభిమానులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అభిమానుల మృతి వార్త తెలుసుకున్న యష్ సురంగి గ్రామానికి వెళ్లారు. యువకుల కుటుంబ సభ్యులను నేరుగా కలిశాడు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.

 

చేతికి అంది వచ్చిన పిల్లలు దూరమైతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. వారికి ఏమిచ్చినా బిడ్డలను కోల్పోయిన బాధ తీర్చలేం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. ఏ అవసరం వచ్చినా నేను తీర్చుతాను. ఇందుకే నేను జన్మదిన వేడుకలు చాలా సింపుల్ గా ముగిస్తున్నాను. మీరు నా కోసం ఫ్లెక్స్ లు కట్టొద్దు. ప్రమాదాల బారిన పడొద్దు. ఇలాంటి అభిమానం నాకు వద్దు. మీరు సురక్షితంగా ఉండండి.

 

మా గురించి కాదు, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండని అభిమానులను యష్ వేడుకున్నాడు. కాగా యష్ కోరంగి గ్రామం వస్తున్నాడని తెలిసి అక్కడకు భారీగా అభిమానులు చేరుకున్నారు. యష్ చూసేందుకు వెళుతూ మరో అభిమాని రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. స్కూటీ పై వెళుతున్న నిఖిల్ కరూర్ అనే యువకుడు పోలీస్ వాహనాన్ని వేగంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స పొందుతూ మరణించాడు.

 

గతంలో కూడా యష్ బర్త్ డే వేడుకలకు బ్యానర్స్ కడుతూ అభిమానులు ప్రమాదాల బారిన పడ్డారు. క్షేమంగా ఉండాలని ఎంతగా హీరోలు చెబుతున్నా కొందరు అభిమానులు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కెజిఎఫ్ మూవీతో యష్ భారీగా అభిమానులను సంపాదించాడు. ఆయనకు ఇండియా వైడ్ గుర్తింపు ఉంది. కెజిఎఫ్ 2 అనంతరం గ్యాప్ తీసుకున్న యష్ ఇటీవల టాక్సిక్ టైటిల్ మూవీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *