బుక్ మై షోలో ‘జైలర్ 2’ ర్యాంపేజ్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద తన సంచలనాన్ని మొదలుపెట్టింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్‌మైషోలో ఈ సినిమాకు ఇప్పటికే 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టిస్తోంది. తలైవర్ ర్యాంపేజ్ మోడ్ ఆన్ కావడంతో, థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలుగా లేదు. టాక్ కూడా డీసెంట్‌గా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాతో రజినీ మరోసారి తన స్టామినా ఏమిటో చూపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. మరి మున్ముందు ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.