యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన సినిమాల్లో గత సినిమా భారతీయుడు 2 భారీ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఇండియన్ సినిమా దగ్గర ఓ పార్ట్ కి సక్సెస్ లేనప్పటికీ మరో పార్ట్ ని కొనసాగింపుగా విడుదల చేస్తుండడం ఈ ఫ్రాంచైజ్ కి సాధ్యం అయ్యింది అని చెప్పొచ్చు. రీసెంట్ గానే ఇండియన్ 3/భారతీయుడు 3 ని పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమా పనులు మొదలు పెట్టగా ఆ సమయంలోనే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుంది అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్నారు.