మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, చిరు ఉతక్కుండానే రెండేళ్లు ఒకే షర్టును ఉపయోగించారట. 2004లో చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన అంజి సినిమా కోసం ఆయన ఇలా చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కోసం చాలా సమయం కేటాయించారు. ఈ క్రమంలో ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌కు రెండేళ్ల సమయం పట్టడంతో.. చిరంజీవి ఆ షర్ట్‌ను ఉతక్కుండానే వాడాల్సి వచ్చిందట.