వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కిర్లంపూడి పోలీసులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నెల 8వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేయగా, అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు ఎప్పుడు హాజరయ్యేది త్వరలోనే తెలియజేస్తానని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేసు నేపథ్యం ఇదే..
ఈ ఏడాది జూలై 16న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అంబటి రాంబాబు అడ్డుకున్నారని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టివేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అప్పట్లోనే కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే తాజాగా విచారణకు రావాలంటూ అంబటి రాంబాబుకు నోటీసులు అందజేశారు.