జపాన్‌లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య మరోసారి రికార్డు స్థాయికి చేరింది. సెప్టెంబర్ 1 నాటి అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో శతాధికుల సంఖ్య 1,07,677కి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 7,914 పెరిగింది.
శతాధికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, జపాన్‌లో జననాల రేటు తగ్గుతుండటం జనాభా పరంగా ఆందోళన కలిగిస్తోంది. వృద్ధుల సంఖ్య పెరగడం, యువ జనాభా తగ్గడం వంటి పరిణామాలు దేశ జనాభా నిర్మాణంపై ప్రభావం చూపుతున్నాయి.
జపాన్‌లో శతాధికుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను 1963 నుంచి నమోదు చేస్తున్నారు. ఆ ఏడాది దేశంలో 100 ఏళ్లు దాటిన వారి సంఖ్య కేవలం 153 మాత్రమే. అప్పటి నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం లక్ష దాటింది.