ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్..! విడుదల పై క్లారిటీ..!

నాచురల్ స్టార్ నాని (Nani)హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విడుదల కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇకపోతే చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ 24వ తేదీ విడుదల చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇలా ఈ సినిమా విడుదల గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల నాని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ నిర్మాతలు స్పందించకపోవడంతో అసలు ఈ సినిమా అనుకున్న విధంగా సెప్టెంబర్ 24వ తేదీ వస్తుందా? రాదా ?అంటూ అసహనం వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ది ప్యారడైజ్ సినిమా విడుదల తేదీ గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24వ తేదీ అనుకున్న విధంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియజేయడంతో నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మరొక 15 రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.