పవన్ ఫ్యాన్స్‌కు సుజీత్ సర్‌ప్రైజ్.. సాయంత్రం 4:05కి ఏం రాబోతోంది?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ‘OG 2’ నుంచి కీలక అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పెద్ద ప్రకటన రాకపోవడంతో కొంత నిరాశ చెందిన ఫ్యాన్స్‌కు దర్శకుడు సుజీత్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సాయంత్రం 4:05 గంటలకు చిన్న సర్‌ప్రైజ్ ఉంటుందని హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది.

‘OG’ సినిమాతో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో చూపించిన సుజీత్.. ఇప్పుడు ‘OG 2’తో ఆ యూనివర్స్‌ను మరింత విస్తరించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ కూడా గతంలో OG యూనివర్స్‌ను కొనసాగించే విషయంపై సంకేతాలు ఇచ్చింది. దీంతో రెండో భాగంలో గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో చూపించబోతున్నారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే, సుజీత్ చెప్పిన 4:05 సర్‌ప్రైజ్ అసలు ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది ‘OG 2’కు సంబంధించిన గ్లింప్స్ కావచ్చా? లేక పవర్‌ఫుల్ యానిమేటెడ్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా మరో చిన్న ప్రమోషనల్ కంటెంట్‌నా అనే చర్చ జరుగుతోంది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ‘OG 2’పై బర్త్‌డే సందర్భంగా సర్‌ప్రైజ్ ఉండొచ్చనే విధంగా హింట్స్ ఇవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి. సాయంత్రం 4:05కి వచ్చే అప్‌డేట్‌తో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.