లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నిపాడు గ్రామం పర్వతరెడ్డిగారిపల్లెలో వైఎస్సార్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, A1 కాంట్రాక్టర్ దిన్నిపాడు హరినాథ్ రెడ్డి వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 100కు పైగా కుటుంబాలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని మంత్రి తెలిపారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని మండిపల్లి పేర్కొన్నారు. హరినాథ్ రెడ్డితో పాటు 100 కుటుంబాలు టీడీపీలో చేరడం నియోజకవర్గంలో పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతుకు నిదర్శనమని అన్నారు.