డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ పనితీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
NH-65లోని 17 బ్లాక్ స్పాట్స్ వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. చిట్యాల ఫ్లైఓవర్‌ను దసరా నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మిగిలిన ఫ్లైఓవర్లను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి, సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.