రేణిగుంట రైల్వే జంక్షన్‌కు 164 ఏళ్ల ప్రస్థానం

1862లో రైల్వే మార్గం రేణిగుంటకు చేరడంతో ప్రారంభమైన రైల్వే ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఒకప్పుడు చిన్న స్థాయి రైల్వే కేంద్రంగా ఉన్న రేణిగుంట.. కాలక్రమేణా అభివృద్ధి చెంది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రైల్వే జంక్షన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులకు రేణిగుంట జంక్షన్ కీలక రవాణా కేంద్రంగా సేవలందిస్తోంది. రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం రైళ్ల రాకపోకలు సాగుతుండటంతో ఈ ప్రాంతానికి రవాణా, వాణిజ్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రేణిగుంట పరిధిలో అదనపు రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట జంక్షన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.