ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ Haier భారత్‌లో కొత్త స్మార్ట్ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. Haier Mini LED M70 సిరీస్ పేరుతో వచ్చిన ఈ టీవీలు 43, 55, 65, 75, 85 అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. Mini LED టెక్నాలజీ, 4K రిజల్యూషన్, Google TV, Dolby Vision, HDR10+ సపోర్ట్‌తో పాటు AI ఆధారిత పిక్చర్ క్వాలిటీ ఫీచర్లను ఇందులో అందించారు.
ఈ సిరీస్‌లోని టీవీలు Mini LED, D-LED ప్యానెల్‌తో వస్తాయి. ఇవి 3840×2160 పిక్సెల్స్ 4K రిజల్యూషన్, 16:9 యాస్పెక్ట్ రేషియో, 178°/178° వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉన్నాయి. డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి కంటెంట్‌ను మెరుగైన వివరాలతో వీక్షించేలా వీటిని రూపొందించారు.
Haier Mini LED M70 సిరీస్‌లో “Micro Dimming” టెక్నాలజీని కూడా అందించారు. ఈ ఫీచర్ స్క్రీన్‌ను అనేక ప్రాంతాలుగా విభజించి, ఆయా సన్నివేశాలకు అనుగుణంగా బ్రైట్నెస్, కాంట్రాస్ట్‌ను డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీంతో ప్రకాశవంతమైన, చీకటి ప్రాంతాల్లోనూ మరింత మెరుగైన వివరాలు కనిపించే అవకాశం ఉంటుంది. Mini LED, 4K డిస్ప్లే, Dolby Vision, HDR10+ వంటి ఫీచర్లతో ఈ కొత్త సిరీస్ ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.