రౌడీ జనార్ధన నుండి క్రేజీ అప్డేట్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రౌడీ జనార్ధన’ నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దసరా సీజన్‌లో ‘రణబాలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ, తన నెక్స్ట్ చిత్రంగా ఈ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ట్రేడిషనల్ లుక్ లో పడవపై కూర్చున్న కీర్తి సురేష్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అయితే, పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్‌ను మాత్రం ఉద్దేశపూర్వకంగా రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచారు.‘రౌడీ జనార్ధన’ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర హీరో లోని అందమైన కోణాన్ని ఆవిష్కరిస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ అందమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం చెబుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొనగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ కథలో విజయ్ దేవరకొండ ఎలా కనిపించబోతున్నారు? కీర్తి సురేష్ పాత్రకు కథలో ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతోంది? అన్నది తెలియాలంటే మరిన్ని అప్‌డేట్స్ కోసం ఎదురుచూడాల్సిందే.