గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘RC17’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ అందించిన ఈ కాంబినేషన్ మరోసారి చేతులు కలపడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘పుష్ప’ సిరీస్‌తో సుకుమార్ క్రేజ్ పెరగడం, రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్‌తో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ బజ్ ఉంది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కియారా అద్వానీ పేరు వినిపించగా, సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండొచ్చనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్ ‘RC17’లో హీరోయిన్‌గా నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్‌ను ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, సారా అర్జున్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే హీరోయిన్ ఎంపికపై ఇప్పటివరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి సారా అర్జున్ నిజంగానే RC17లో హీరోయిన్‌గా నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే మేకర్స్ ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.