బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘కొరియన్ కనకరాజు’.. 10 రోజుల్లో రూ.50.30 కోట్ల గ్రాస్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌ ‘కొరియన్ కనకరాజు’ (#KOKA) బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది.

యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రూ.12 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

కేవలం 10 రోజుల్లోనే ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా రూ.50.30 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు మేకర్స్‌ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.