ప్రజల భద్రత, సంక్షేమానికే అత్యున్నత ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి తమ ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని పేర్కొన్నారు.

సమాజంలోని ప్రతి అంశంలోనూ చట్టం ప్రకారమే పాలన సాగిస్తామని సీఎం తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పాలన అందించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ప్రజలకు సంపూర్ణ జవాబుదారీతనంతో పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ప్రభుత్వ విధానాన్ని వెల్లడించారు.